Friday, November 15, 2019

Telugu Sukthulu

Telugu Sukthulu are the telugu prakruthi quotes and useful suggestion to cross many situations in life. Carry Telugu Sukthulu where ever you go in life and spread happiness and joy in life.

ఏదైనా

ఏదైనా జరిగినపుడు ఆందోళన పడినంత మాత్రాన తేడా రాదు! గుర్తుంచుకోండి!

మాయలో

మాయలో, భ్రమలో వున్నాం అని తెలుసుకోవడం మంచిదే! అంతకంటే ముఖ్యం 'బయటపడే ప్రయత్నం చేయడం'!

మారే వాటిని,

మారే వాటిని, మారే వారిని చూసి బాధపడుతూ వున్నావు అంటే నీలో ఇంకా మార్పు రాలేదన్నమాట ! నిర్మొహం వైపుకు!

జ్ఞానం వున్నా

జ్ఞానం వున్నా మార్పును అంగీకరించలేక పోతున్నారు అంటే శక్తి సరిపోవడంలేదు అని అర్థం!

అనుభవాలే

జీవితంలో అన్నీ అనుభవాలే! అన్నీ జ్ఞానాలే!

కొన్ని అనుభవాలు

కొన్ని అనుభవాలు మనకు అత్యంత బాధాకరంగా వుండొచ్చు! కానీ అవే మనకు ఊహించని పురోగతిని ఇస్తాయి! గుర్తుంచుకోండి!

జ్ఞానంవల్ల

జ్ఞానంవల్ల అనుభవం! అనుభవంవల్ల మరింత జ్ఞానం!

అన్నీ అద్బుతంగానే

జీవితంలో అన్నీ అద్బుతంగానే వున్నాయి! అంతా అద్బుతంగానే వుంది! అందరూ అద్బుతంగానే వున్నారు! అంతే!

ఏమీ కాలేదు!

ఏమీ కాలేదు! ఏమీ జరగలేదు! అంతా అద్బుతంగానే వుంది! గుర్తుంచుకోండి!

కావలసిందే జరిగింది!

రావలసిన, కావలసిన అనుభవాలే వచ్చాయి! కావలసిందే జరిగింది! మన ఆత్మ పురోగతి కోసం మనం ఏరి కోరి తెచ్చుకున్న అద్బుతమైన అనుభవాలే అన్నీ! గుర్తుంచుకొండి!

అనవసరంగా

అనవసరంగా ఆలోచించడం మానేస్తే సగం సమస్యలు అవే పోతాయి!

మన అనవసర ఆలోచనలే

ఈ ప్రపంచంలో అత్యంత ఇబ్బందికర వ్యసనం మద్యపానం లాంటివి కాదు ! మన అనవసర ఆలోచనలే మన అతి ఇబ్బందికర వ్యసనాలు!

మబ్బులు వున్నంత వరకే

మబ్బులు వున్నంత వరకే తుఫాను అయినా ఇంకేదైనా! మబ్బులు తొలగితే అంతా మల్లీ మాములే!

స్వాతంత్రం

బయట ఎంత స్వాతంత్రం వచ్చినా లొపల కూడా స్వాతంత్రం రానంత వరకు మనల్ని మనమే బానిసలుగా, బందీలుగా చేసుకుని ఏడుస్తూనే వుంటాం!

ఆనందం అంటువ్యాధి

ఆనందం అంటువ్యాధి లాంటిది! మీరు సానుకూలంగా, ఆనందంగా వుంటే, ప్రజలు మీకు సహజంగానే ఆకర్షించబడతారు!

మీ దారికి మీరే

మీ దారికి మీరే మంచి ఉదాహరణ అయ్యేంతగా సాధన చేయండి! అప్పుడు మీరు ఎవరినీ నమ్మించే అవసరం వుండదు!

మీ గురించి మీకు

మీ గురించి మీకు ఎంత ఎక్కువగా అర్థం అయితే మీ కంటే ఎంత ఎక్కువ మంది గొప్పవాళ్లు ఈ ప్రపంచంలో వున్నారో మీకు అర్థం అవుతుంది!

గొప్ప బహుమతి

గుర్తుంచుకోండి! ఒక్కోసారి మనం కోరుకున్నది జరగక పోవడమే ఒక గొప్ప బహుమతి అవుతుంది! అది అర్థం కావటానికి కొంతకాలం పడుతుంది అంతే!

గమ్యం చేరేది !

ఏ దారిలో అయినా నడుస్తూ ఉంటేనే గమ్యం చేరేది !దారి గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటే కాదు!గుర్తుంచుకోండి!- ప్రకృతి

విజయం!

ప్రయత్నమే విజయం ! అంతే ! -ప్రకృతి

మనోశాంతి

ప్రతిదీ ఎందుకు జరిగింది అని సమాధానం కోసం ప్రయత్నించి వున్న మనోశాంతి కూడా పోగొట్టుకోకండి !

ఇరుక్కుపోయివుంటే

ఎక్కడైనా మీరు ఇరుక్కుపోయివున్నారు అంటే తెలిసో తెలియకో అది మీ నిర్ణయమే అయివుండవచ్చు ! ఒకసారి సరిచూసుకోండి !

తక్కువగా మాట్లాడాలి!

చక్కగా వినగలగాలి, నేర్చుకోవాలి అనుకుంటే అతి తక్కువగా మాట్లాడాలి ! అర్థం చేసుకోండి!

అనిశ్చితత్వవం !

జీవితంలో అనిశ్చితత్వాన్ని ఆనందంగా స్వీకరించి ఆనందంగా ముందుకు సాగుతూ వుండగలగటమే' జ్ఞానం' అంటే !

మొదటి అడుగు

మొదటి అడుగుఈ రోజు పడితేనేవిజయం సాధ్యం!

పరిస్థితులు

అన్ని పరిస్థితులనూ నియత్రించలేక పోవచ్చు కానీ వేటి ప్రభావం మనపై పడుకుండా చూసుకునే శక్తి మాత్రం మనకు వుంది ! గుర్తుంచుకోండి ! -ప్రకృతి

విజయం!

ఎంతటి విజయమైనా మొదటి అడుగుతోనే మొదలు అవుతుంది ! గుర్తుంచుకోండి! ఆలస్యం చేయకండి!

RECOMMENDED VIDEOS

POPULAR

X