Sunday, December 15, 2019

Telugu Quotations in Telugu Language

Telugu Quotations in Telugu Language given here are beautiful quotes about life. All the Telugu Quotations given here are in spoken Telugu language. All are wonderful and beautiful Telugu quotes

స్వచ్చమైన

స్వచ్చమైన సంకల్పానికి ఎప్పుడూ తిరుగువుండదు! అంతే!

ఏది పంచినా

ఏది పంచినా, పంచుకున్నా అది సరిగ్గా అందాలి అంటే నిస్వార్థం, నిరహంకారం అతి ముఖ్యం! గుర్తుంచుకోండి!

మానసిక గందరగోళం

మానసిక గందరగోళాన్ని సమస్యగా పరిగనించి మరింత పెంచుకోకండి! జ్ణానితో మాట్లాడం లేదా సాధన పెంచడం చేస్తే ఇట్టే పోతుంది!

సమయాన్ని

సమయాన్ని అతి ఉన్నతమైన ఆత్మ సాధనకు ఎక్కువగా కేటాయించడమే సర్వసమస్యలకు సమాధానం!

గతించిన విషయాల

గతించిన విషయాల గురించి ఎక్కువగా అలోచిస్తే చేతిలోవున్న ఈ అద్బుత క్షణం కూడా సమాధి అవుతుంది! గుర్తుంచుకోండి!

మన బాధలకు

మన బాధలకు వ్యక్తులు కారణం అనుకోవడం ఒకరకమైన అమాయకత్వం!అజ్ఞానం! బాధలకు మూలం మన చంచలమైన మనసు! అంతే!

ఆలోచనలే

ఆలోచనలే జీవితం! సరైన ఆలోచనతోనే సరైన జీవితం! అంతే!

నిర్లక్ష్యమే

'నిర్లక్ష్యమే' అతిపెద్ధ అడ్డు గోడ! మనలోనుండి అది తీసివేయనంతవరకు మల్లీ పడుతూనే వుంటాం! గుర్తుంచుకోండి!

ప్రతీ అనుభవాన్ని

ప్రతీ అనుభవాన్ని జ్ఞానం ఉపయోగించి మహా అనుభవంగా మార్చుకోవచ్చు! లేదా ఒక సమస్యగాచూసి చతికిల పడవచ్చు! అంతా మన నిర్ణయం!మన ఇష్టం! అంతే!

వ్యక్తులపై కాక

వ్యక్తులపై కాక మన దృష్టి అంతా శక్తి,జ్ఞానం పెంచడంపై వుంచితే మన చుట్టూ వున్న వారికి జరగవలసిన మంచి కంటే ఎక్కువే జరుగుతుంది! మనవల్ల!

చెప్పేది మంచే అయినా

చెప్పేది మంచే అయినా, సత్యమే అయినా బలవంతంగా ఒప్పించే పనిలేదు! మనస్పూర్తిగా వివరిస్తే చాలు! కావాలన్న వాడు వింటాడు! అంతే!

బుద్ధత్వ’మే

'బుద్ధత్వ'మే ఈలోకంలో అతి ఉన్నతమైన జీవితలక్ష్యం!

మనలక్ష్యం

మనలక్ష్యం ఉన్నతమైనది అయినపుడే మనచుట్టూ ఉన్నతమైన వ్యక్తులు,విషయాలు చేరుతాయి!

లక్ష్యం వల్లే

ఉన్నతమైన లక్ష్యం వల్లే ఉన్నతమైన భావాలూ ఉన్నతమైన మాటలు పుట్టుకొస్తాయి!

పంచడం

మన వద్ద ఏమివుంది అన్నది కాదు గొప్ప!మనము ఈ ప్రపంచానికి ఏమిపంచుతున్నాం?అన్నదే మన గొప్ప!

స్వేఛ్చ

వదలడమే స్వేఛ్చ ! స్వేఛ్చయే ఆనందం! అంతే!

మన అసలు బాధ

పరిస్థితులవల్ల కాదు బాధ ! వాటి చుట్టూ మనం అల్లే కథల వల్లే మన అసలు బాధ !

ఆలోచించండి

ఓటమి గురించి కాదు! ప్రయత్న లోపం గురించి ఆలోచించండి ! అంతే!

విమర్శలకు

విమర్శలకు అవసరానికి మించి స్పందించడం ఒకానొక శక్తి విహీనత !

ఆశలు తగ్గిస్తే

ఆశలు తగ్గిస్తే ఎక్కడ వుంటే అక్కడ ఆనందం ఎక్కువ అవుతుంది!

ప్రతీ అడుగు

వేసే ప్రతీ అడుగు, చేసే ప్రతీ పనీ మీ సాధన,మీ ఆనందంలో భాగంగానే చేయండి! లేకపొతే చివరికి మిగిలేది నిరాశే!

మంచికే

జరిగినది ఏదైనా, ఎందుకు అయినా సరే అది మంచికే ! సహనంతో తిరిగి శక్తిని పెంచుకుంటూ వేచివుండండి ! సరైన సమయం కోసం! అంతే !

లక్ష్యాలు

ఉన్నవి రెండే లక్ష్యాలు : 1.ఈ క్షణంలో సంపూర్తిగా వుండటం ! 2. ఎప్పుడూ మనోశూన్యంలో వుండటం ! మిగిలినవాటి గురించి ఆసమయంలో ఆలోచిస్తే చాలు! అంతే!

నేర్పించే పనిలేదు

ఎవరికీ ఏదీ నేరుగా నేర్పించే పనిలేదు! తమకు తాము నేర్చుకునే వాతావరణం కల్పిస్తే చాలు!

ఆత్మ సంతృప్తి

ఏమున్నా లేకున్నా ఆత్మ సంతృప్తే అతిగొప్ప అనుభూతి ! అతిగొప్ప సంపద ! ఈ ప్రపంచంలో!

పంచడమే ధర్మం!

పంచడమే ధర్మం! మన వద్ద వున్న మంచిది ఏదైనా !

సాధించినది

సాధించినది ప్రదర్శించే పనిలేదు ! ప్రదర్శనపై దృష్టి పెరిగితే సాధించటానికి సమయం వుండదు!

నిద్రలేపే వాడే గురువు

నీలో లేనిది కాదు , నీలో దాగి వున్నది గుర్తించి నిద్రలేపే వాడే గురువు !

RECOMMENDED VIDEOS

POPULAR

X