Sunday, December 15, 2019

Telugu Manchi Matalu

Telugu Manchi matalu are the Telugu Prakuthi quotes which are very much useful for uplifting our life. Use all Telugu manchi matalu in your day today life and reach your destiny joyfully.

జీవితం

జీవితం గురించే ఇంకా అర్థం కాకపోతే, అర్థం చేసుకొకపోతే జీవిత అనంతర విషయాలు అర్థం అవ్వాలనుకోవటం హాస్యాస్పదమే అవుతుంది!

అందరూ కారణజన్ములే !

అందరూ కారణజన్ములే ! జన్మ కారణం అర్థం చేసుకున్నప్పుడు, ఆకారణం కోసం పనిచేసినప్పుడు ! అంతే!

ఆలోచించుకోండి

గతం అన్నది నిన్నటి చరిత్ర ! ఈ క్షణం అన్నది రేపటి చరిత్ర ! రేపటి చరిత్ర సృష్టించటంపై దృష్టి ఎక్కువ పెట్టాలో ? లేక గతించిన చరిత్ర గురించి చింతిస్తూ కూర్చోవాలో ? ఆలోచించుకోండి మీరే !

జ్ఞానం

నిన్న ఎలావున్నావు అన్నది కాదు! రేపటి కోసం ఇప్పుడు చేసేదే సాధన మరి జ్ఞానం !

అసలు సిసలైన జ్ఞాని

అసలు సిసలైన జ్ఞాని ఈ ప్రపంచానికి ఎప్పుడూ పిచ్చోడిలానే కనబడుతూ వుంటాడు ! పిచ్చి మనసులోనుండి చూస్తూ వుంటారు కాబట్టి !

తప్పక మార్చుకోగలిగినది

ప్రపంచాన్ని మార్చాలనిచాలానే ప్రయత్నించా !కానీ చివరికి అర్థం అయిన విషయం ఏంటంటే'తప్పక మార్చుకోగలిగినదినన్ను నేను మాత్రమే అని' !అంతే!

నేనిలాంటి వాడిని

నేనిలాంటి వాడిని అని మీరు చెప్తున్నారు లేదా అనుకుంటున్నారు అంటే అనంతమైన మిమ్మల్ని మీరే చిన్న చట్రంలో బంధించుకుంటున్నారని అర్థం! గుర్తుంచుకోండి! అంతే!

రేపన్నది లేదని గుర్తించండి !

మీజీవితాన్ని మార్చుకోవాలని, మెరుగుపరచుకోవాలని కోరిక మరి పట్టుదల నిజంగా మీలో వున్నాయా ? నిజంగా వుంటే మార్పుకు ఈ రోజే శ్రీకారం చుట్టండి !! రేపన్నది లేదని గుర్తించండి ! అంతే!

ఒకద్వారం మూయబడినపుడు

ఒకద్వారం మూయబడినపుడు మరో ద్వారం తప్పక తెరుచుకోబడుతుంది! సహనంతో వేచి వుండండి! అంతే!

అనంతమైన మిమ్మల్ని

నేనిలాంటి వాడిని అని మీరు చెప్తున్నారు లేదా అనుకుంటున్నారు అంటే అనంతమైన మిమ్మల్ని మీరే చిన్న చట్రంలో బంధించుకుంటున్నారని అర్థం! గుర్తుంచుకోండి! అంతే!

మౌనంలోకి వెళ్ళండి !

మొదట మౌనంలోకి వెళ్ళండి ! తర్వాత మీ అంతరాత్మ ఏమి చెప్పాలనుకుంటుందో వినండి ! అంతా మంచే జరుగుతుంది! అంతే!

అద్భుతాలు

ప్రతీ ఒక్కరమూ జీవితంలో అనేక అద్భుతాలను చేయగలిగే శక్తి వున్నవారమే ! గుర్తించడమే తరువాయి!

ఎక్కువ శక్తిమంతులు

జీవితంలోకి ఏపరిస్థితి వచ్చినా వాటికంటే మీరే ఎక్కువ శక్తిమంతులని ఎప్పుడూ గుర్తుంచుకోండి!

తప్పు

ఎదుటి వారిలో వెంటనే ఏదైనా తప్పు కనిపెట్టారంటే, ఆ తప్పు మీలో కూడా తెలిసో తెలియకో వుండి వుండొచ్చు! లేకపోతే అంత త్వరగా గుర్తించటం, స్పందించటం జరగదు ! ఒక్కసారి సరిచూసుకోండి! సరి చేసుకోండి!

భవిష్యత్తుకు పునాది

చివరిగా ఎప్పుడు మీతో మీరు గడిపారు ? అదే మీ భవిష్యత్తుకు పునాది! గుర్తుంచుకోండి !

మనసు పిచ్చిది

మనసు పిచ్చిది - ఆగదు ! కోతిలా ! ఆగింది అంటే జ్ఞానోదయం అయినట్టే !

అన్నిటికీ దూరంగా వెళ్ళు !

రోజూ కొద్దిసేపు అన్నిటికీ దూరంగా వెళ్ళు ! మనసు అదే కుదుట పడుతుంది!

ముఖ్యమైన ధర్మం

మనకున్న అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం ఏంటంటే మనల్ని మనం తిరిగి మనవద్దకు తెచ్చుకోవడమే !

విజయం!

ప్రయత్నమే విజయం ! అంతే ! -ప్రకృతి

సహకారం

ఈ విశ్వం ఎప్పుడూ మీకు సహకరిస్తూనే వుంటుంది! అలా మీకు అనిపించటంలేదంటే ఎదో పాఠం నేర్చుకోవలసివుంది అని అర్థం! అంతే!

ఇతరులను మెప్పించడానికి

ఇతరులను మెప్పించడానికి మారేపనిలేదు ! అర్థమైన సత్యంలో జీవిస్తే అదే పదేవేలు!

మన దారి మనది !

అందరూ! మనలాగే వుండాలనేదేమీ లేదు! మన దారి మనది ! ఆ దారి మనకు సరిగా అర్థం అయితే చాలు!

పొరపాట్లు

మీ పొరపాట్లను మీరు ఒక్కసారి అంగీకరిస్తే వాటిని వేరెవ్వరూ మీకు వ్యతిరేకంగా వినియోగించలేరు ! అర్థం చేసుకోండి !

మనోశాంతి

ప్రతిదీ ఎందుకు జరిగింది అని సమాధానం కోసం ప్రయత్నించి వున్న మనోశాంతి కూడా పోగొట్టుకోకండి !

సమాధానం

ప్రతిదీ ఎందుకు జరిగింది అని సమాధానం కోసం ప్రయత్నించి వున్న మనోశాంతి కూడా పోగొట్టుకోకండి !

తక్కువగా మాట్లాడాలి!

చక్కగా వినగలగాలి, నేర్చుకోవాలి అనుకుంటే అతి తక్కువగా మాట్లాడాలి ! అర్థం చేసుకోండి!

తృప్తి

మీలో తృప్తి వుంటే మీరు ధనవంతులా లేక పేదవారా అన్న విషయంతో సంబంధంలేదు!

శక్తివంతుడు

శక్తిమంతుడే క్షమించగల్గుతాడు ! క్షమించగల్గిన వాడే శక్తివంతుడు అవుతాడు!

వివేకం

జీవితంలో దేనికి ఎంత విలువనివ్వాలి ? దేనికి ఎంత ఆలోచించించాలి ? అన్నదే వివేకం అంటే !

అహం !

మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవటమే అహం ! -ప్రకృతి

RECOMMENDED VIDEOS

POPULAR

X