ఏది పంచినా
ఏది పంచినా, పంచుకున్నా
అది సరిగ్గా అందాలి
అంటే
నిస్వార్థం, నిరహంకారం
అతి ముఖ్యం!
గుర్తుంచుకోండి!
మానసిక గందరగోళం
మానసిక గందరగోళాన్ని
సమస్యగా పరిగనించి
మరింత పెంచుకోకండి!
జ్ణానితో మాట్లాడం లేదా
సాధన పెంచడం చేస్తే
ఇట్టే పోతుంది!
గతించిన విషయాల
గతించిన విషయాల గురించి
ఎక్కువగా అలోచిస్తే
చేతిలోవున్న ఈ అద్బుత క్షణం కూడా
సమాధి అవుతుంది!
గుర్తుంచుకోండి!
నిర్లక్ష్యమే
'నిర్లక్ష్యమే'
అతిపెద్ధ అడ్డు గోడ!
మనలోనుండి అది
తీసివేయనంతవరకు
మల్లీ పడుతూనే వుంటాం!
గుర్తుంచుకోండి!
ప్రతీ అనుభవాన్ని
ప్రతీ అనుభవాన్ని జ్ఞానం ఉపయోగించి
మహా అనుభవంగా మార్చుకోవచ్చు!
లేదా
ఒక సమస్యగాచూసి చతికిల పడవచ్చు!
అంతా
మన నిర్ణయం!మన ఇష్టం!
అంతే!
వ్యక్తులపై కాక
వ్యక్తులపై కాక
మన దృష్టి అంతా
శక్తి,జ్ఞానం పెంచడంపై
వుంచితే మన చుట్టూ వున్న
వారికి జరగవలసిన మంచి కంటే
ఎక్కువే జరుగుతుంది!
మనవల్ల!
చెప్పేది మంచే అయినా
చెప్పేది మంచే అయినా,
సత్యమే అయినా
బలవంతంగా ఒప్పించే పనిలేదు!
మనస్పూర్తిగా వివరిస్తే చాలు!
కావాలన్న వాడు వింటాడు!
అంతే!
ఉన్నతమైన లక్ష్యాల వల్లే
ఉన్నతమైన లక్ష్యాల వల్లే
ఉన్నత మైన అలవాట్లు!
ఉన్నతమైన స్నేహితులు!
అంతే!
ఏ అనుభవానికి
ఏ అనుభవానికి
ఎవరినీ నిదించకు!
ప్రతిదీ నీ ఆత్మప్రగతి కోసం
నీవే కోనితెచ్ఛు కొన్నావన్న
విషయం గుర్తుంచుకో!
మొదటి నుండి నీవు
మొదటి నుండి నీవు
సర్వ స్వతంత్రుడివే!
ప్రతిదీ నీ ఇష్టం!నీ నిర్ణయమే!
నీ స్వంత ఆలోచన!
స్వంత ప్రయోగమే!
ఎవరూ అడ్డు లేరు!రాలేదు!
అంతే !
ప్రతిదీ మన ఇష్ట ప్రకారం
ప్రతిదీ మన ఇష్ట ప్రకారం,
కోరుకున్న ప్రకారమే జరిగింది!
ప్రతిదీ పరమార్థం కోసమే జరిగింది!
అది అవగతం కావడం
కొంత కష్టం కావచ్చు అంతే!
తగిన శక్తి, జ్ఞానం లేక పోవడంవల్ల!
ఆశాశ్వతమైనవి
ఆశాశ్వతమైనవి
శాశ్వతం అనుకుని
వాటికే ఎక్కువ సమయాన్ని,
జీవితాన్ని అంకితం చేయడం
'మాయ'!
కొంతజ్ఞానం వచ్చాక
కొంతజ్ఞానం వచ్చాక
గురువును
మించి పోయాను
అనుకోవడం
అత్యంత
హాస్యాస్పదమైన
'మాయ'!
ఈ ప్రపంచంలో వున్నది
ఈ ప్రపంచంలో వున్నది
అంతా సరైన వాళ్ళే!
కానీ సరైన దారిలో లేకపోవచ్చు!
వారి బాధ్యత మనదే!
ఎక్కువ తక్కువ,
ఎక్కువ తక్కువ, మంచి చెడు
ఇలా రకరకాల వాళ్లు లేరు!
ఈ ప్రపంచంలో!
ఉన్నది
సత్యం తెలిసిన వాళ్లు!
సత్యం తెలియని వాళ్లు!
అంతే!