Monday, September 16, 2019

Neethi Vakyalu

Neethi Vakyalu of life. Neethi is the way of life for everybody on earth. Neethi is essence of experience in life with truth after experiments. Use Neethi Vakyalu in life and reach the best Milestones of life.

రాళ్ళను వేస్తూ పోతే

ఆగి ప్రతి కుక్కపై రాళ్ళను వేస్తూ పోతే మీ గమ్యాన్ని మీరు ఎప్పటికీ చేరుకోలేరు! గుర్తుంచుకోండి!

శత్రువు

భయమే శత్రువు! భయమే శాపం!

భయమే

భయమే ఎక్కువ భయపడాల్సిన భయం!

అతి పెద్ద కల్మషము

అతి పెద్ద కల్మషము, 'అజ్ఞానమే'! అర్థం చేసుకోండి! త్వరగా బయటపడండి!

ఇతరుల అభిప్రాయాల

జ్ఞానులు ఇతరుల అభిప్రాయాల బారినపడి దుఃఖించరు! అవసరం అనుకుంటే ఒంటరిగా అయినా సరే ప్రయాణం చేస్తారు!

మీరు చేయాలి

మీరు చేయాలి అనుకున్న మంచి గురించి అవసరానికి మించి అందరి అభిప్రాయాలు అడిగితే నిరుత్సాహ పరిచే అవకాశం ఎక్కువ! చేయడం మొదలు పెట్టండి! అంతే!

ప్రశాంతంగా

మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ప్రపంచమంతా శాంతంగా,హాయిగా కనిపిస్తుంది! అనిపిస్తుంది! అంతే!

మంచి చేయాలి

మంచి చేయాలి అనుకున్నప్పుడు ఎవరికోసం, ఎవరి అభిప్రాయాల కొసం ఎదురు చూడకు! చేతిలో వున్నది ముందు మొదలుపెట్టు! లేకపొతే అది ఎప్పటికీ కాదు!

ఆనందంగా వుండటానికి

ఆనందంగా వుండటానికి మంచి రోజులకై ఎదురు చూడకు! ఆనందంగా వుండటం మొదలు పెడితే మంచి రోజులు అవే వస్తాయి!

సత్యం తెలియక కాదు

సత్యం తెలియక కాదు సమస్య! సత్యం విస్మరించడమే అసలు సమస్య! గుర్తుంచుకోండి!

మూఢులు

మూఢులు మరియు అజ్ఞానులు అజ్ఞానం మరియు కోరికతో స్థిరపడ్డానికి నిర్మించిన ధర్మాలను సత్యంగా భావించకండి! అసలు సత్యం ఏంటో సాధనతో శోధన చేసి తెలుసుకోండి!

లక్ష్యం

అంతర్గత శాంతే 'లక్ష్యం' !!

గమ్యం చేరేది !

ఏ దారిలో అయినా నడుస్తూ ఉంటేనే గమ్యం చేరేది !దారి గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటే కాదు!గుర్తుంచుకోండి!- ప్రకృతి

అహం !

మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవటమే అహం ! -ప్రకృతి

భ్రాంతి

భ్రాంతి ఉన్నన్ని రోజులు సంపూర్ణ శాంతి వుండదు ! అంతే !

సత్య సాధన!

మీరు సత్య సాధనలో వుంటే ఎవరో కొందరు మీకు సహాయం చేయనంత మాత్రాన ప్రయాణం ఆగదు ! మరో రూపంలో సహాయం చేయటానికి ప్రకృతి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది ! గుర్తుంచుకోండి ! -ప్రకృతి

మనలని మనం కోల్పోవడం!

దేని వెనక అవసరానికి మించి పడినా మనల్ని మనం కోల్పోయి వున్నాం అని అర్థం ! ఒక్కసారి గమనించి చూడండి ! అంతే ! -ప్రకృతి

మంచి పని!

ఒక మంచి పని చేయటానికి దారి దొరకటం లేదు అంటే ఇంకా మనస్ఫూర్తిగా  సంకల్పించలేదు అని అర్థం చేసుకోండి ! అంతే !

సరిగ్గా ప్రయత్నం

ఏదీ నేర్చుకోలేకపోతున్నారు అంటే ఏదీ సరిగ్గా ప్రయత్నం చేయట్లేదు అని అర్ధం ! అంతే !

ఇతరులలో మార్పు

ఇతరులలో మార్పు ఎప్పుడూ కోరుకుంటూ ఉన్నారంటే మీరు ఎప్పుడూ బాధను కోరుకున్నట్లే !

చిన్న వాళ్ళు

ఈ ప్రపంచంలో చిన్న వాళ్ళు ఎవరూ లేరు! అలా ఎవరైనా కనపడుతున్నారంటే మనలో చిన్న ఆలోచనలున్నట్లే ! గమనించండి !

RECOMMENDED VIDEOS

POPULAR

X