Friday, November 15, 2019

Life quotes in Telugu Language

Life quotes in Telugu Language are the the Prakruthi Quotes which can be applied in life practically. All the Life quotes in Telugu Language are written by Prakruthi Umamahesh with very high practical experiences.

సరైన జీవితానికి నాంది!

సజ్జనులతో, సత్యం అవగతం అయినవారి సాంగత్యంతోనే సరైన జీవితానికి నాంది! గుర్తుంచుకోండి!

ఏది సాధించాలన్నా

ఏది సాధించాలన్నా ముందు దానికి తగిన వ్యక్తిగా మారండి! ఆ తర్వాత పెద్ద పనేం వుండదు! అంతే!

జరిగింది ఏదైనా

జరిగింది ఏదైనా మంచికే! అది అర్థం అయ్యేవరకు సహనంతో వేచివుండండి!

మనకు మనం

ఆనందం వ్యక్తులవల్ల,హోదాలవల్లా రాదు! మనకు మనం రోజూ చెప్పుకునే ఆలోచనల వల్ల మొదలవుతుంది ఆనందం!

సంపూర్తి ఆనందం

ఏమి సాధించినా,ఎందరు వున్నా చివరికి నిన్ను నీవు సంపూర్తిగా చేరనంత వరకు సంపూర్తి ఆనందం వుండదు! ఈ జీవితంలో!

గుర్తింపు కోసం

గుర్తింపు కోసం ఏదేదో చేసి ఆయాస పడే పనిలేదు! సరైన దారిలో వెళ్తే రావలసిన గుర్తింపు అదే వస్తుంది! రాకపోయినా వచ్చే నష్టంలేదు! ఆనందం అయితే తప్పక వస్తుంది!

నీతో నీవు

నీలో నీవు , నీతో నీవు వున్నంత కాలం నీకు ఎవరి వల్లా భయం వుండదు! నీవల్ల ఎవరికీ భయం వుండదు! అంతే!

తగ్గించే పని చేయండి!

తెలిసో తెలియకో జరిగిన సంఘటనకు ప్రతికూల ఆలోచనలు జోడించి దానిని మరింత ఇబ్బందిగా మార్చుకోకండి! వీలైతే సానుకూల ఆలోచనలువాడి తగ్గించే పని చేయండి!

సరైన జీవితం!

ఆలోచనలే జీవితం! సరైన ఆలోచనతోనే సరైన జీవితం!

సరి చేసుకోవడం

ఆలోచనలను సరి చేసుకోవడమే మనల్ని మనము, మన జీవితాన్ని మనం సరి చేసుకోవడం అంటే!

ఏది ఎలావున్నా

అన్నీ, అందరూ మనం అనుకున్న విధంగానే వుండాలి అనుకోవడమే బంధం! ఏది ఎలావున్నా ఆనందంగా వుండటమే సన్యాసం!

చేసేది మంచి పని అయినపుడు

చేసేది మంచి పని అయినపుడు అది ఎంత పెద్దది అయినా సరే ఎవరు వున్నా,లేకున్నా ధైర్యంగా మీ అడుగు మీరు వేయండి! అంతే!

ఆగిపోవడం మాములే!

చేతకాని వాళ్లు, అవసరం లేదనుకునే వాళ్లు, ఇష్టం లేని వాళ్లు,అర్థం కాని వాళ్లు ఇలా అనేక మంది దారిలో మధ్యలో ఆగిపోవడం మాములే! నీ దారిలో నీవు ముందుకు వెళ్తూనే వుండు! అంతే!

మాట్లాడనివ్వండి

మీరు కాదు ! మీ అంతర మౌనాన్ని స్వయంగా మాట్లాడనివ్వండి! అంతే!

జ్ఞాని అనబడతాడు!

బాగా తెలివిగా మాట్లాడినంత మాత్రాన జ్ఞాని అనబడరు! లొపల శాంతి - ప్రేమ,ధైర్యం ఉన్నవాడే జ్ఞాని అనబడతాడు!

ఒంటరి వాడివి కాదు!

నీవు ఎప్పటికీ ఒంటరి వాడివి కాదు! నీతో నీవు వున్నంత వరకు! గుర్తుంచుకో!

మనయిష్టం

కావాలంటే జీవిత కాలం నిద్రపోవచ్చు! లేదా లేచి ముందుకు వెల్లవచ్చు! అంతా మనయిష్టం! మన నిర్ణయమే!

ప్రశాంతతకు

ప్రశాంతతకు , శాంతికి నిలయంగా మీ మనసును ,మీ హృదయాన్ని తయారు చేసుకోండి! అంతే!

ఎవ్వరి గురించీ, దేని గురించీ

ఎవ్వరి గురించీ, దేని గురించీ ఆలోచించే పనిలేదు! మీ యోగ సాధన, మీ జ్ఞాన సాధన గురించి తప్ప! మిగిలినవన్నీ అందులో భాగాలే!

చెయ్యలేము అనుకున్న పనులు

చెయ్యలేము అనుకున్న పనులు చేయటానికి ప్రయత్నించిన ప్రతిసారి మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతూ పోతుంది! గుర్తుంచుకోండి!

సరైన దారిలో

నిన్ను సరైన దారిలో నడిపించ గలిగే ఒకానొక గొప్ప గురువు నీవే !

కొరత

కొరత అన్నది ఈ సృష్టిలో లేనే లేదు! అవసరానికి మించి కోరటంవల్లే ఊహా జనితమైన కొరత ఏర్పడి మనల్ని ఇబ్బంది పెడుతూ వుంటుంది! అంతే!

సహాయం

చెయ్యగలిగే పరిస్థితి లో వుండి కూడా సహాయం చేయట్లేదు అంటే మనం మనకే తెలియని ఏదో భయంలోనో అజ్ఞానంలోనో ఉన్నట్లు! ఒక్కసారి సరిచూసుకోండి!

సంపూర్ణ ఆత్మశాంతి

సంపూర్ణ ఆత్మశాంతి రావాలంటే క్షమించడం నేర్చుకోవలసిందే!

సమస్యలు

సమస్యలను తీర్చుకోవచ్చు! లేదా తీర్చుకోలేక పోవచ్చు! కానీ చూసే విధానం మార్చుకుని బాధను తగ్గించి ఆనందంగా వుండటం మాత్రం ఖచ్చితంగా చేయవచ్చు! ప్రతి ఒక్కరూ !

కోరుకున్న ఆథిధులే !

జీవితంలో మనకు తారస పడిన ప్రతి ఒక్కరూ మనము కోరుకున్న ఆథిధులే ! అది అర్థం అయితే అందరితో ఆనందమే ! ఆనందం!

రేపటి బలం

ఈ రోజు కష్టమే రేపటి బలం ! అంతే!

అంతర్మౌనమే

అంతర్మౌనమేసృజనాత్మకతకు తొలి మెట్టు!

మనసును

మనసుతో పోరాడిగెలవడం సాధ్యం కాదు!కానీ మనసునుపక్కన పెట్టడం సాధ్యమే !నిరంతర సాధనతో!

RECOMMENDED VIDEOS

POPULAR

X