Sunday, December 15, 2019

Inspirational Quotes in Telugu

Inspirational Quotes in Telugu are her here to inspire you to achieve goals of life. Use all Inspirational Quotes in Telugu in life and reach your destiny with enthusiasm.

ఏ అనుభవానికి

ఏ అనుభవానికి ఎవరినీ నిదించకు! ప్రతిదీ నీ ఆత్మప్రగతి కోసం నీవే కోనితెచ్ఛు కొన్నావన్న విషయం గుర్తుంచుకో!

మొదటి నుండి నీవు

మొదటి నుండి నీవు సర్వ స్వతంత్రుడివే! ప్రతిదీ నీ ఇష్టం!నీ నిర్ణయమే! నీ స్వంత ఆలోచన! స్వంత ప్రయోగమే! ఎవరూ అడ్డు లేరు!రాలేదు! అంతే !

దేనికోసం

దేనికోసం, ఎవ్వరి కోసం పరుగులు పెట్టకు! అదే స్వాతంత్రం!

ఈ క్షణమే సర్వం

ఈ క్షణమే సర్వం! ఈ క్షణమే యోగం! ఈ క్షణమే ఆత్మ బంధువు! అంతే!

ప్రతీ క్షణం

ప్రతీ క్షణం ఒక యోగమే! జ్ఞానంతో వుంటే!

నిన్ను నీవు

నిన్ను నీవు మరవడమే "మాయ"!

తాత్కాలికమైన

తాత్కాలికమైన వాటి కోసం గురువును, సాధనను పక్కన పెట్టడం 'మాయ' !

ప్రతిదీ మన ఇష్ట ప్రకారం

ప్రతిదీ మన ఇష్ట ప్రకారం, కోరుకున్న ప్రకారమే జరిగింది! ప్రతిదీ పరమార్థం కోసమే జరిగింది! అది అవగతం కావడం కొంత కష్టం కావచ్చు అంతే! తగిన శక్తి, జ్ఞానం లేక పోవడంవల్ల!

సత్యాన్ని

సత్యాన్ని, నిత్యం చేయవలసిన సత్య సాధనను పక్కన పెట్టడం 'మాయ'!

ఆశాశ్వతమైనవి

ఆశాశ్వతమైనవి శాశ్వతం అనుకుని వాటికే ఎక్కువ సమయాన్ని, జీవితాన్ని అంకితం చేయడం 'మాయ'!

కొంతజ్ఞానం వచ్చాక

కొంతజ్ఞానం వచ్చాక గురువును మించి పోయాను అనుకోవడం అత్యంత హాస్యాస్పదమైన 'మాయ'!

సరైన దారి

ఈ ప్రపంచానికి సరైన దారి చూపవలసిన బాధ్యత మనలాంటి సత్యవంతులదే! గుర్తుంచుకోండి!

ఈ ప్రపంచంలో వున్నది

ఈ ప్రపంచంలో వున్నది అంతా సరైన వాళ్ళే! కానీ సరైన దారిలో లేకపోవచ్చు! వారి బాధ్యత మనదే!

ఎక్కువ తక్కువ,

ఎక్కువ తక్కువ, మంచి చెడు ఇలా రకరకాల వాళ్లు లేరు! ఈ ప్రపంచంలో! ఉన్నది సత్యం తెలిసిన వాళ్లు! సత్యం తెలియని వాళ్లు! అంతే!

మన తలరాత

మన తలరాత ఇంకా మన చేతుల్లోకి రాలేదు అంటే మనలో మరింత శక్తిని , మరింత మంచిని పెంచాలని అర్థం!

అంచనాలకి

సమాజం యొక్క అంచనాలకి మీరు సరిపోకపోనంత మాత్రాన మీరు తక్కవ వారు కాదు! గుర్తుంచుకోండి!

మాయ మల్లీ మల్లీ

మాయ మల్లీ మల్లీ కమ్ము కోకుండా వుండాలంటే గురువులతో, సజ్జనులతో సాంగత్యంలో వుండాలి మరి! వేరే దారి లేదు!

ఆలోచిస్తూ వుంటే

ఆలోచిస్తూ వుంటే ఏదో ఒక అఢ్ఢు కనబడుతూనే వుంటుంది! లేచి ముందడుగు వేయడం మొదలు పెట్టండి! ఆడ్దుగోడలు అవే తొలగుతాయి!

ఇప్పుడూ,ఎప్పుడూ

ఇప్పుడూ,ఎప్పుడూ ఏమీ కాలేదు!అయిపోలేదు జీవితం!చతికిల పడిపోయే పనిలేదు దేనికీ!సాధన తిరిగి మొదలు పెట్టిపట్టుదలతో ముందుకు వెళితేఅన్నీ సర్దుకుంటాయి తిరిగి!అంతే!

దారి తప్పిన వారిపై

దారి తప్పిన వారిపై ద్వేషం పెంచుకోక కరుణతో సరైన దారి చూపండి వీలైతే! అంతే!

జరిగి పోయిన

జరిగి పోయిన తప్పుఒప్పులను అతిగా ఆపాదించుకుని అద్బుతమైన ఈ క్షణాన్ని చేతులారా పాడుచేసుకోకండి! గుర్తుంచుకోండి!

అవసరానికి మించి

అవసరానికి మించి ప్రాపంచిక జ్ఞానం వాడి మీ సహజమైన సహృదయానికి,ఆనందానికి దూరం కాకండి!

పుట్టుకతో సహజంగా

పుట్టుకతో సహజంగా మనమంతా సజ్జనులమే! ధన్యులమే! ప్రపంచంవల్ల మనపై పడిన దుమ్ము దులుపు కోవడమే చేయవలసిన పని!

మన ఆలోచనలే

మన ఆలోచనలే మనల్ని అదః పాతాళానికి తోసేది! స్వర్గానికీ తీసుకెళ్లేది! ఆలోచనల గురించి ఒక్కసారి ఆలోచించండి!

ఏమి చేసినా ఏదోఒకటి అనుకునే వాడు ఎప్పుడూ ఈ లోకంలో ఉంటూనే వుంటారు! వారి మాటలతో మంచి చేసే వారికి, మంచి దారిలో వెళ్ళే వారికీ ఏ సంబంధం లేదు!

పట్టుదలతో

పట్టుదలతో జీవిస్తేనే జీవితం! లేకపొతే దాన్నే బ్రతకడం అంటారు! బ్రతకాలో, జీవించాలో ఎవరి ఇష్టం వారిది!

ప్రత్యేకించి

ప్రత్యేకించి భౌతిక జీవితంలేదు! ఉన్నదంతా ఆధ్యాత్మికమే! ఆధ్యాత్మిక ప్రయోగాలు చేయటానికి భూమిపైకి దిగి వచ్చిన సాధకులం మనమంతా!

తెలిసి చేసినా తెలియక చేసినా

తెలిసి చేసినా తెలియక చేసినా మన ప్రతీ అడుగు ఒక ప్రయోగమే!ఒక ప్రయత్నమే! ప్రయోగాలకు ఫలితాలే కానీ వైఫల్యాలు వుండవు! గుర్తుంచుకోండి!

ప్రపంచంలో వున్న

ప్రపంచంలో వున్న అసలు సమస్యలు రెండే! 1.స్వార్థం!!! 2.అహం!!! మిగిలిన సమస్యలు అన్నీ వీటి నుండి ఉత్పన్నం అయినవే!

జీవితంలో ఎక్కువ శాతం

జీవితంలో ఎక్కువ శాతం అహం వల్ల పెద్దవిగా చూపబడిన ఊహా జనిత సమస్యలే! మూలం అయిన అహన్నీ పక్కన పెడితే జీవితం ఎంత హాయిగా వుంటుందో చెప్పనలవికాదు!

RECOMMENDED VIDEOS

POPULAR

X